Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 2:47 pm Posted by : ramakrishna

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు

భూభారతి చట్టంపై అధికారులు అవగాహన కల్పిస్తారు

మంత్రి పొంగులేటి

నారాయణపేట, బతుకమ్మ : భూభారతి చట్టంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చిందని  రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతుందన్నారు. ధరణి అమలులో ఉన్నప్పుడు అధికారులు వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్ లో ’భూ భారతి‘  పై ఏర్పాటు చేసిన రెవెన్యూసదస్సులో ఆయన మాట్లాడారు. ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని, లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారని మంత్రి చెప్పారు.