గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

మెండోరా, బతుకమ్మ : మెండోరా మండలంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సిఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. దరఖాస్తు చేసుకున్న విగ్రహాలకు జియో టాకింగ్ ఉంటుందని లేకపోతే నిమజ్జనం సమయంలో ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు. ఉత్సవ కమిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని శాంతియుత వాతావరణం లో ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, ఎస్సై సుహాసిని, ఎంపీడీవో లక్ష్మణ్, విద్యుత్ ఏ ఈ అంజద్ పాషా తదితరులు పాల్గొన్నారు.