Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 5:38 pm Posted by : ramakrishna

జి.జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా మంజూరైన 41 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు తమ విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఇంటర్వ్యూలను జూలై 23న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. కళాశాలలో వివిధ విభాగాల్లో మొత్తం 41 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు–5, ఇంగ్లీష్–2, కామర్స్–5, బీబీఏ–2, బీబీఏ లాజిస్టిక్స్–1, బిజినెస్ అనలిటిక్స్–1, ఫైనాన్స్–1, టాక్సేషన్–1, బీఎఫ్‌ఎస్‌ఐ–1, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్–4, బీసీఏ–1, డేటా సైన్స్–1, జువాలజీ–4, బయోటెక్నాలజీ–1, ఫిజిక్స్–1, డిజిటల్ ఎలక్ట్రానిక్స్–1, ఎకనామిక్స్–1, హిస్టరీ–2, పొలిటికల్ సైన్స్–1, పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం)–1, పబ్లిక్ పాలసీ–1, స్టాటిస్టిక్స్–1, ఏఐ/ఎంఎల్–1, హెల్త్ కేర్–1 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీని కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే యూజీసీ నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత తప్పనిసరి. బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.