Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 5:05 pm Posted by : ramakrishna

మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 174 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

 

. . . కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కాబ్రా

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 174 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్టు కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా వెల్లడించారు. కాంట్రాక్ట్ విధానంలో 18 పోస్టులు ఉన్నాయని, వీటిలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 13 నుంచి ఆగస్టు 14, 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో 156 పోస్టులను భర్తీ చేయనున్నారని, వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ 37, ఆఫీస్ సబార్డినేట్ 24, ల్యాబ్ అటెండర్ 19, ఓటీ టెక్నీషియన్ 10, అనస్థీషియా టెక్నీషియన్ 8, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 7, బార్బర్ 6, దోబీ/ప్యాకర్ 6, ఎలక్ట్రీషియన్ 6 తదితర పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ పోస్టులకు ఆగస్టు 13, 2026 ఉదయం 11 గంటల నుంచి ఆగస్టు 20, 2026 మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థులు మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని, పోస్టుల వారీగా విద్యార్హతలు, దరఖాస్తు ఫారం, మార్గదర్శకాలు తదితర పూర్తి వివరాలను మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ప్రిన్సిపల్ సూచించారు.