Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 2:03 pm Posted by : ramakrishna

జిల్లాలో బార్ల ఏర్పాటుకు  దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో 4 పునరుద్ధరింపబడని(Non-renewed) బార్ల స్థానంలో 4 బార్లు (నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో-3, ఆర్మూర్ మున్సిపాలిటీ లో-1) ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తగిన ధ్రువ పత్రాలతో సుభాష్ నగర్ లోని ఎక్సైజ్ సూపరింటెండ్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.  నిర్ణీత నమూనాలో నింపిన దరఖాస్తు ఫారం, రూ.లక్ష ఛాలన్ (నాన్ రిఫెండెబుల్), ఆధార్ లేదా పాన్ కార్డుతో సెల్ఫ్ డిక్లరేషన్, మూడు పాస్ పోర్టు సైజు ఫోటోలు. 26.04.2025 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకొవచ్చన్నారు.  29.04.2025 ఉదయం 11.00 గంటలకు సుభాష్ నగర్ లోని తమ కార్యాలయంలో కలెక్టర్  డ్రా తీస్తారని వెల్లడించారు. సందేహాల నివృత్తి కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.