Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 7:56 pm Posted by : ramakrishna

కస్తూర్బ గాంధీ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో (ఆంగ్ల మధ్యమం) లో వచ్చే విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో 40 సీట్లు ఖాళీలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారిణి బి.శ్యామల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసేటప్పుడు పూర్వం చదివిన పాఠశాల 5 వ తరగతి బోనాఫైడ్, ఇతర విద్యా సంబంధిత ధ్రువపత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డు, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, జనన ధ్రువీకరణ పత్రము జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రము జిరాక్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రము జిరాక్స్, ఆరోగ్య ధ్రువీకరణ పత్రము సర్టిఫికెట్ జిరాక్స్ లను తప్పనిసరిగా జతపర్చాలని పేర్కొన్నారు.