వృద్ధాప్య పింఛన్ల కోసం తిప్పలు
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత బతుకమ్మ, బాన్సువాడ : వృద్ధాప్య పింఛన్ల కోసం పలువురికి తిప్పలు తప్పట్లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు లబ్ధిదారుల పాలిట శాపంలా మారుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు, వితంతు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలనెలా అందించే పించన్లను కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.ఈ విషయమై సబ్...