Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 6:00 pm Posted by : ramakrishna

నర్సింగ్ టీచర్ పోస్ట్ కు దరఖాస్తులు

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో  గెస్ట్ ఫ్యాకల్టీ నర్సింగ్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దరఖాస్తుకు బుధవారం చివరి రోజు అని అన్నారు. విద్యార్థులకు నాలుగు నెలలు నర్సింగ్ తరగతులు బోధించేందుకు పోస్టు ఖాళీగా ఉందని వేతనం నెలకు రూ. 23,000 ఉంటుందని విద్యార్హతలు బీఎస్సీ నర్సింగ్ ఉండాలని తెలియజేశారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.