ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రం లోని కేజీబీవీ పాఠశాలలో అడ్మిషన్ కోసం బాలికల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేజీబీవీ ఎస్ ఓ సుంకరి సంధ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 తరగతిలో 40 మంది బాలికలు, 7 తరగతిలో 20 మంది బాలికలకు అవకాశం ఉన్నట్లు ఎస్ ఓ సంధ్య తెలిపారు. పాఠశాలలో అడ్మిషన్ తీసుకునే బాలికలు తమ బోనఫైడ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ల తో పాటు 1 ఫోటో తీసుకొని ఏర్గట్ల కేజీబీవీలో సంప్రదించాలని తెలిపారు.