మాక్లూర్, బతుకమ్మ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాక్లుర్ మండలంలోని చిక్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మహిళలందరూ మంగళ హారతులతో అమ్మవారి ని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, మహిళలు, చిన్నారులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.