డిల్లీ, బతుకమ్మ : వీధి కుక్కలకు స్టెరిలేషన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22 న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తంచేసింది. వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా చలనం లేదా అని ప్రశ్నించింది. స్పందించని సీఎస్ లు అందరూ తదుపరి విచారణలో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ సీఎస్ లకు మినహాయింపు ఇచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది.