. . . షబ్బీర్ అలీ ని కలిసిన ఈద్గా నిర్మాణ కమిటీ సభ్యులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అహ్లే హదీస్ ఈద్గా అభివృద్ధి, నిర్మాణ పనుల కోసం రూ.18.15 లక్షల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని ఈద్గా నిర్మాణ కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన కమిటీ ప్రతినిధులు, ఈద్గా నిర్మాణ పనులు పూర్తిచేయడానికి ఆర్థిక సహాయం అవసరమని వివరించారు. ఈద్గా నిర్మాణం పూర్తయితే ధర్మపురి హిల్స్ తో పాటు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులకు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.18 లక్షల 15 వేల నిధులు కేటాయించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ఈద్గా నిర్మాణానికి అవసరమైన నిధులు వీలైనంత త్వరగా మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మతపరమైన ప్రార్థనా స్థలాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈద్గా నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.