ఏపీపీ పరీక్ష వాయిదా వేయాలి : కవిత  

హైదరాబాద్, బతుకమ్మ:  ఈనెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించనుంది. దీంతో ప్రభుత్వం ఏపీపీ రాత పరీక్షను  వాయిదా వేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్...