- మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా
బతుకమ్మ,మోర్తాడ్: బీమ్ గల్ లో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమంలో ఆడ బిడ్డల పెళ్ళి కి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు 16 నెలలు గడుస్తున్నా ఇవ్వక పోవడంతో ప్రజల తరపున బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ నాయకులు అడిగితే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి సునీల్ రెడ్డి పోలీసులను ఉసిగొలిపి బీ ఆర్ ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయించి 30 మంది .మా కార్యకర్తల పై విచక్షణ రహితంగా లాఠీ దెబ్బలు కొట్టడాన్నీ బీ ఆర్ ఎస్ మోర్తాడ్ మండల పార్టి తరపున దీన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని పేర్కొన్నారు. బాల్కొండ చరిత్ర లో ఇలాంటి సంఘటన లు గతంలో ఎప్పుడు జరగలేదని దీని అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు మూత్యాల సునీల్ రెడ్డే కారణం అని దీనికి బాధ్యత వహిస్తూ తులం బంగారు అడిగితె లాఠీ దెబ్బలు కొట్టడం వలన చాలా మంది గాయపడ్డారు అని బేషరతుగా క్షేమాపన చెప్పాలని మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా డిమాండ్ చేశారు. గురువారం ఉత్తర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రజల తరపున పోరాడుతామని మీ అధికార జులుంతో పోలీసులను అడ్డుపెట్టుకుని లాఠీ దెబ్బలకు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. ఇకనైనా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, కోఆర్డినేటర్ పర్స దేవన్న, పీఏసీఎస్ చైర్మన్ కళ్ళెం అశోక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిరంజీవి, మాజీ ఎంపీటీసీ లు అశోక్ శాశ్రీ, మాజీ సర్పంచ్ లు కడారి శ్రీనివాస్, భోగ ఆనంద్, యూసుఫ్, మహిపాల్, చిన్నారెడ్డి, ఏనుగు రాజేశ్వర్, ఉదయ్, రోహిత్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.