- ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఋణలు ఇప్పించడంలో భీమ్ గల్ ఐకెపీ ఏపీఎం రవీందర్ ముందున్నారని ఎం పీ డీ ఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం బదిలీ పై వెళ్తున్న ఏ పీ ఎం రవీందర్ ను ఐ కె పీ సెర్ప్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ గంగారెడ్డి తో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గంగారెడ్డి మాట్లాడుతూ బదిలీ పై వెళ్తున్న తన తోటి ఏ పీ ఎం రవీందర్ ఇక్కడ పని చెసినంత కాలం మహిళా సంఘాల బలోపేతానికి, ఏ గ్రేడ్ లో ఉంచడానికి తన వంతు కృషి చేసారని అన్నారు. మహిళా ఋణలు ఇప్పించి, తిరిగి రికవరీ చెయ్యడంలో ఆయన దిట్టా అన్నారు. మండలంలోని అన్ని మహిళా సంఘాలు లాభల్లో ఉంచడానికి కృషి చేసాడని తెలిపారు ఈ కార్యక్రమం లో ఏపీఓ నర్సయ్య, సీ సీ లు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, రఘుపతి, భాస్కర్, గంగసాయిలు, గంగాధర్, లలితా, సుమలత, సురేష్, గణేష్, ముత్యం, గ్రామ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.