గ్రాడ్యుయేట్ల నిరాసక్తత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అటు అధికారుల అలసత్వం.. ఇటు పట్టభద్రుల్లో చైతన్య లోపం వెరసి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తూతూ మంత్రంగా జరగబోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ’బతుకమ్మ‘ ఆన్లైన్ పత్రికలో వస్తున్న వరస కథనాలకు అధికారంలో స్వల్ప కదలిక వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పట్టభద్రుల ఓటర్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మీసేవ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఉచిత సలహాలు మాత్రమే ఇస్తున్నారు. కనీసం దరఖాస్తు ఫారాలు సైతం ఏ ఒక్క గ్రామపంచాయతీలో అందుబాటులో...