Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 8:40 pm Posted by : ramakrishna

అపర శక్తి.. దయామయి వారాహి మాత

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అపర శక్తి అపర దయామయి వారాహి మాత అని నిజామాబాద్ లో శ్రీ వారాహి మాత దేవాలయం అంకురార్పణ చేయడం సంతోషం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ఆదివారం నగరంలోని అమ్మ నగర్ అమ్మ వెంచర్ లో నూతనంగా శ్రీ వారాహి మాత దేవాలయం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు, అంతరం వృక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

Apara Shakti.. Dayamai Varahi Mata

ఈ సందర్భంగా మాట్లాడుతూ..అపర శక్తి అపర దయామయి అయిన వారాహి మాత ఆలయము నిజామాబాద్ నగరంలో మొట్టమొదటి ఆలయం కాబోతోందని అన్నారు. ఈ ఆలయ ప్రాంగణానికి సహకరించిన అమ్మ వెంచర్ కమిటీ సభ్యులు అధ్యక్షులు నరేష్ కు, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆలయ నిర్మాణం సంకల్పము అమ్మవారి అనుగ్రహము ఈ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి మా ఆప్త మిత్రుడు మంచాల జ్ఞానేందర్ స్వామి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని, వారాహి మాత అమ్మవారి ఆలయం ఇందూరు నగరంలోనే ప్రత్యేక ఆలయంగా పేరుంది, భక్తులకు కొంగుబంగారంగా నిలవాలన్నారు. ఫిబ్రవరి 10 వ తేదీన శ్రీ హంపి పీఠాధిపతి చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమము జరుగుతుందని గుర్తు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ వెంచర్ కమిటీ సభ్యులు, హార్ట్ ఫుల్ యువర్ వాకింగ్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Apara Shakti.. Dayamai Varahi Mata