Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 6:06 pm Posted by : ramakrishna

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఏవో శ్రీకాంత్

ఇందల్వాయి, బతుకమ్మ :  ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట  నష్టాన్ని మండల స్థాయి అధికారులు నివేదికలు సిద్ధం చేసి  ప్రభుత్వానికి పంపాలని సూచించడంతో ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రయాన్ పల్లి,త్రియంబక్ పేట్ గ్రామాలలో  శుక్రవారం భారీ వర్షాలకు నష్టపోయిన  వ్యవసాయ పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ రైతులతో పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామ గ్రామాన సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు ఏవో శ్రీకాంత్ తెలిపారు. దీనికి వ్యవసాయ పంట పొలాలు నష్టపోయిన రైతులందరూ సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రకాష్ గౌడ్, ప్రశాంత్,రైతులు గ్రామ కంపెనీ పాల్గొన్నారు.

AO Srikanth inspects the damaged crop fields