Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2025, 6:07 pm Posted by : ramakrishna

ఉద్యమంతోనే ఏదైనా సాధ్యం

  • అందని ద్రాక్షాగా బీసీల బతుకులు
  • తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్

 

రుద్రూర్, బతుకమ్మ  : ఉద్యమంతోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య సమావేశాన్ని మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి యువజన రాష్ట్ర కన్వీనర్ సంపత్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల బతుకులు అందని ద్రాక్షాగా మారాయన్నారు. బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఉదృతంగా పోరాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పటివరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. బీసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే బీసీలతో ఏకైమై జూలై 17 వ తేదీన పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా జాగృతి కార్యదర్శి భరద్వాజ్, బీసీ సంఘం నాయకులు దర్శనం దేవేందర్, చంద్రకాంత్, బోధన్ జాగృతి కన్వీనర్ హరీ, నరేష్, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్, పున్న పురుగయ్య, పోచయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Anything is possible with movement