Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 6:16 pm Posted by : ramakrishna

ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు

 

. . . జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఈ నెల 11న జరగనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ  ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే సమయంలో 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ పాస్ బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు,ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు తదితర వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని కలెక్టర్ కోరారు.