ఫిర్యాదు ఏదైనా ‘పంచాయితీ’నే..
ఆ ఎస్సైల ఇష్టారాజ్యం సివిల్ వివాదాలకు అడ్డాలు ఆ స్టేషన్ లు ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరిపై అనేక ఆరోపణలు ఠాణాలకు వెళ్లేందుకు జంకుతున్న బాధితులు నిజామాబాద్, బతుకమ్మ: కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైల ఆగడాలకు అంతులేకుండాపోతోంది. పోలీస్ స్టేషన్ లను పంచాయితీలకు అడ్డాలుగా మారుస్తున్న ఎస్సైలు.. హత్యలను ఆత్మహత్యలుగా, క్రిమినల్ కేసులను సివిల్ పంచాయితీలుగా మారుస్తూ ‘రూల్’ చేస్తున్నారు. ఓ ఎస్సై రియల్టర్లతో దోస్తీ చేస్తూ సెటిల్ మెంట్లు చేస్తుండగా, మరో ఎస్సై సొంతంగా ఇసుక దందా చేస్తున్నాడు. ఇంకో ఎస్సై ఫిర్యాదు ఏదైనా...