గ్రామాల్లో యాంటీ లార్వా లిక్విడ్ స్ప్రే
బతుకమ్మ మోర్తాడ్ : కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో నీటిలో దోమలు అభివృద్ధి చెంది తద్వారా ప్రజలకు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన గ్రామపంచాయతీ కార్యదర్శి స్వప్న డొంకల్ గ్రామంలో అక్కడక్కడ ఇండ్ల మధ్య వాటర్ నిలిచిపోవడంతో దోమ లార్వా అభివృద్ధి చెందుతాయని గ్రహించి దోమల లార్వా ల నివారణకై శుక్రవారం యాంటీ లార్వా లిక్విడ్ స్ప్రే చేయించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో దోమల లార్వాలు చనిపోతాయని దోమల అభివృద్ధిని అరికట్టవచ్చని తెలియజేశారు....