బోధన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

 బతుకమ్మ, బోధన్: కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15న ప్రారంభించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బోధన్ మునిసిపల్ కార్యాలయ ఆవరణలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్ సిబ్బంది, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత, పిల్లలు, మహిళలు మాదక ద్రవ్యాల బానిస కాకూడదని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ...