జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పకడ్బందీ చర్యలు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి...