డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం
బతుకమ్మ, బోధన్: బోధన్ కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ, ఎస్సై మనోజ్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పౌరులు మత్తు వ్యసనాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ వెంకటనారాయణ తెలియజేశారు.