అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ర్యాలీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం పాత కలెక్టరేట్ వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మైదానం నుంచి సాయి రెడ్డి పెట్రోల్ బంక్ వరకు కొనసాగింది. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. కరప్షన్ తో నష్టాలు,...