నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంతిరెడ్డి రాజిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి నుంచి కాంగ్రెస్ కొనసాగుతున్న ఆయన డీఎస్ కు, సుదర్శన్ రెడ్డికి ప్రధానే అనుచరుడిగా గుర్తింపు పొందారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) పదవిని అంతిరెడ్డి ఆశించినప్పటికీ.. ముందు నుంచి వస్తున్న ఊహాగానాల ప్రకారమే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కింది.