ఏసీబీ వలలో మరో ఎస్ఐ
శామీర్ పేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖ.. ఆ శాఖ అన్న తేడా లేకుండా వరుస దాడులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలకు కృషి చేస్తున్నారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. సోమవారం సైబరాబాద్ కమీషనరేట్ లోని శామీర్ పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఎం.పరుశురాం ఒక వ్యక్తి నుండి రూ.22వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఫిర్యాదుధారుని, అతని సేవకుని...