Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 8:02 pm Posted by : ramakrishna

ఏసీబీ వలలో మరో ఎస్ఐ

శామీర్ పేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖ.. ఆ శాఖ అన్న తేడా లేకుండా వరుస దాడులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలకు కృషి చేస్తున్నారు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు. సోమవారం సైబరాబాద్ కమీషనరేట్ లోని శామీర్ పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఎం.పరుశురాం ఒక వ్యక్తి నుండి రూ.22వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి… ఫిర్యాదుధారుని, అతని సేవకుని పేర్లను సైబరాబాద్ కమీషనరేట్ లోని శామీర్ పేట రక్షకభట నిలయములో నమోదైన ఒక  కేసులో నిందితులుగా చేర్చకుండా ఉండటానికి, అతని మొబైలు ఫోన్ ను తిరిగి ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.22,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన శామీర్ పేట ఎస్.ఐ. ఎం. పరుశురామ్ పట్టుబడ్డారు.