Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 9:08 pm Posted by : ramakrishna

మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

 

నల్గొండ, బతుకమ్మ :

 

నల్గొండలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. స్థానిక బస్ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు వెంటనే అప్రమత్తమై వెంకన్నను అడ్డుకున్నారు. అనంతరం ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు.