నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఆ ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ద్వారా ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని, స్థానిక పర్యాటక అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.