గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : "ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ" ఆధ్వర్యంలో  నిర్వహించిన ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2025 -26 విద్యా సంవత్సరానికి గాను స్వయం ప్రతిపత్తి హోదా గల గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో  తెలంగాణ రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి  దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ఈ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో 5వ స్థానంలో నిలిచి,...