Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 5:34 pm Posted by : ramakrishna

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : “ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ” ఆధ్వర్యంలో  నిర్వహించిన ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2025 -26 విద్యా సంవత్సరానికి గాను స్వయం ప్రతిపత్తి హోదా గల గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో  తెలంగాణ రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామ్ మోహన్ రెడ్డి  దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ఈ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో 5వ స్థానంలో నిలిచి, ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డా. రామ్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం,   పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకడమిక్ కో-ఆర్డినేటర్ ఐ. గంగాధర్, పి.ఆర్.ఓ. డా.దండుస్వామి, ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్  డా. రామస్వామి,  వివిధ విభాగాల అధిపతులు వినయ్ కుమార్, డా.రంజిత, డా. ఉమాకిరణ్, డా రామకృష్ణ, డా.రమేష్  గౌడ్, బాలమణి, పూర్ణ చందర్ రావు, అధ్యాపకులు, మరియు ఏ.ఓ. జగన్, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్,  కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు,  నిజామాబాద్ పట్టణ ప్రముఖులు, ప్రజలు, సంతోషం వ్యక్తం చేశారు.

Another prestigious award for Giriraj Government College