మరో పాకిస్థానీ స్పై అరెస్ట్..

గగన్‌దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసిన పంజాబ్‌ పోలీసులు వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ గూఢచార సంస్థతో ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆర్మీదళాల మోహరింపులు, ప్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని అతడు ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పంజాబ్ డీజీపీ  గౌరవ్ యాదవ్ తెలిపారు.