జుక్కల్ నియోజకవర్గానికి మరో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

  జుక్కల్, బతుకమ్మ:   జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవతో జుక్కల్ మండలంలోని సావర్‌గావ్ గ్రామంలో శుక్రవారం కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు కండెబలూర్ – సావర్‌గావ్ – విఠల్‌వాడి మార్గంలో కంగ్టి వరకు నడుస్తూ ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ కొత్త బస్సు సర్వీస్ ద్వారా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే...