Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 6:14 pm Posted by : ramakrishna

జుక్కల్ నియోజకవర్గానికి మరో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

 

జుక్కల్, బతుకమ్మ:

 

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవతో జుక్కల్ మండలంలోని సావర్‌గావ్ గ్రామంలో శుక్రవారం కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు కండెబలూర్ సావర్‌గావ్ విఠల్‌వాడి మార్గంలో కంగ్టి వరకు నడుస్తూ ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ కొత్త బస్సు సర్వీస్ ద్వారా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపా రు.గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం, ప్రజల రవాణా ఇబ్బందులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ బస్సు సర్వీస్ ప్రారంభంతో పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. చిరకాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న సావర్‌గావ్, పరిసర గ్రామాల ప్రజలు తమ కోరిక నెరవేరినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Another new RTC bus service launched for Jukkal constituency.