- 13 ఏళ్లుగా సేవ చేయడం నేటి యువతకు ఆదర్శం
- ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
నిజమాబాద్ సిటీ, బతకమ్మ : మానవతా సేవకు కేరాఫ్ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అనాథలకు అండగా నిలుస్తు విధివంచితులకు కొత్త రూపు తీసుకురావడం మామూలు విషయం కాదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ డాక్టర్ కోదండరాం పేర్కొన్నారు. 13 ఏండ్లుగా నిర్విరామ సేవ చేయడం నేటి యువతకు, అందరికి ఆదర్శమని, యువత స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 13వ వార్షికోత్సవ వేడుకలు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం ఆ సంస్థ వ్యవస్థాపకుడు డా.మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రో.కోదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధలను చేరదీయటం, నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, అనాధ శవాలకి అంత్యక్రియలు చేయడం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.

ఎవరు చేయలేని సేవా కార్యక్రమాలు చేస్తు అందరికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా గొప్ప సంకల్పంతో మనశ్శాంతి కోవెల ఆశ్రమ ఏర్పాటుకు స్దల సేకరణ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అధ్యక్షుడు చిట్టిమిల హరిప్రసాద్, రజనీష్, దారం గంగాధర్, రత్నాకర్, సుమీల, పాల్గోన్నారు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
