Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:50 pm Posted by : ramakrishna

రైతు భరోసా నిధుల విడుదలలో మరో కీలక ముందడుగు

 

. . . జూలై 4 నాటికి 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.77 కోట్లు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మరో కీలక అడుగు వేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తూ ప్రభుత్వం తన కట్టుబాటును మరోసారి చాటుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 జూలై 4 నాటికి మొత్తం 67.44 లక్షల మంది రైతులకు రూ.7,135.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ ఆర్థిక సహాయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.18 కోట్ల ఎకరాల సాగుభూమికి పెట్టుబడి మద్దతు అందినట్లు వెల్లడించింది. జూన్ 30న 1 ఎకరం లోపు ఉన్న 26,55,045 రైతులకు రూ. 878 కోట్లు, 2 ఎకరాలోపు ఉన్న 17,72,604 రైతులకు రూ.1603 కోట్లు విడుదల చేశారు. జులై 1న 3 ఎకరాల లోపు ఉన్న 10,68,093 రైతులకు రూ.1590 కోట్లు, జులై 2న 4 ఎకరాల లోపు ఉన్న 6,39,059 రైతులకు రూ.1330 కోట్లు విడుదల చేశారు. అలాగే జులై 3న 5 ఎకరాల లోపు ఉన్న 4,41,143 రైతులకు రూ.1187 కోట్లు, జులై 4న 6 ఎకరాల లోపు ఉన్న 1,68,524 రైతులకు రూ.545 కోట్లు విడుదల చేశారు.

 

Another key step forward in the release of Rythu Bharosa funds.