రాష్ట్రంలో మరో పరువు హత్య…!

పుట్టిన రోజు నాడు యువకుడిని నరికిన చంపిన వైనం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ :  రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో ఈఘటన చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమించాడని పూరెల్ల సాయికుమార్ అనే యువకుడిని యువతి తండ్రి గొడ్డలితో నరికి చంపారు.  సాయికుమార్ ను పుట్టిన రోజునాడే హత్య చేయడంతో గ్రామంలో విషాదం  అలుముకుంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.