Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 6:45 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో వడదెబ్బ తో మరో రైతు మృతి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు వడ దెబ్బకి గురై అకాల మరణాన్ని పొందుతున్నారు. పనిచేస్తే గాని పొట్టగడువని కూలీలతో పాటు రైతులు ఎండలకు విల విల్లాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆదివారం వడదెబ్బతో రైతు కల్లంలోనే ప్రాణాలు విడిచాడు. శుక్రవారం ఎల్లా రెడ్డి లో వడ దెబ్బ కి గురై రైతు మరణించిన ఘటన మరువకముందే మరో రైతు వడ దెబ్బ తో ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి మల్లయ్య (48) వరుసగా 3 రోజులు పాటు మాశ్చురైజర్ కోసం వడ్లు ఆరబోశాడు. దీంతో వడదెబ్బకు గురయ్యాడు. ఆదివారం వడ్లు నేర్పుతూ ఒక్క సారిగా కుప్పకూలి కల్లంలోనే మృతి చెందాడు. వడ దెబ్బతో చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరతున్నారు