తెలంగాణ నుంచి సీబీఐకు మరో కేసు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ నుంచి సీబీఐకు మరో కేసు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణను సీబీఐకు అప్పగించగా.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపిన సిట్ కీలక ఆధారాలను సేకరించింది.