మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్, బతుకమ్మ : మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది.  గంటకు పైగా సముద్రం పైనే విమానం చక్కర్లు కొట్టింది.  ముంబై నుంచి న్యూ యార్క్ వెళ్లాల్సిన విమానంలో  టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకుంది. పైలట్ అనౌన్స్మెంట్ తో  ప్రయాణికులు వణికిపోయారు. చాకచాక్యంతో  పైలట్ విమానంను ముంబైలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.