అధికార యంత్రాంగంలో అజ్ఞాతవాసి

నిజామాబాద్, బతుకమ్మ:  జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్రమైన కలెక్టరేట్ లో ఓ అజ్ఞాతవాసి చక్రం తిప్పుతున్నాడు. అసలు ఏ శాఖ పరిధిలో తానున్నదీ సాక్షాత్తు కలెక్టరేట్ పాలనావిభాగానికి అంతుచిక్కకుండా వ్యవహరిస్తున్న ఆ అధికారి ‘అజ్ఞాతవాసి’గా చలామణి అవుతున్నాడు. మెప్మాలో ఏవోగా డిప్యూట్యేషన్ తెచ్చుకున్న ఆయన.. ఆ కాల పరిమితి పూర్తయిన తరువాత ఎక్కడ  కొనసాగుతున్నాడో తెలియకుండా జాగ్రత్తపడుతున్న వైనంపై ‘బతుకమ్మ’ ఇటీవల ‘మెప్మా..  చెప్మా.. ఆ అధికారి ఎక్కడ?’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు...