శ్రీశైలంలో వైభవంగా వార్షిక కుంభోత్సవం
శ్రీశైలం, బతుకమ్మ : శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారికి వార్షిక కుంభోత్సవ సాత్వికబలి వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత అంకాలకమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబాదేవికి నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమార్చన, పారాయణలు ఏకాంతంగా నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ సాంప్రదాయంగా రజకుడిచే శ్రీ చక్రం వద్ద స్థలశుద్ధి చేసి ముగ్గులు వేయించి పూజలు చేశారు. వందల కేజీల పసుపు కుంకుమలతో ఆలయ ఈవో దంపతులు అర్చక వేదపండితులచే శాంతి ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం సుమారు ఐదువేలకుపైగా గుమ్మడి కాయలతోపాటు...