పరుశురామ ప్రభాత్ శాఖ వార్షకోత్సవం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కోటగల్లిలో గల పద్మశాలి హై స్కూల్లో ఆర్ఎస్ఎస్ పరుశురామ ప్రభాత్ శాఖ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణశాస్త్రి విజయ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘ శాఖ కార్యకర్తల వికాసానికి తోడ్పాటున అందిస్తుందని, శాఖ ద్వారా స్వయంసేవకులలో ఆత్మవిశ్వాసం ధైర్యం జట్టు భావన ఏర్పడతాయన్నారు. ఆటల ద్వారా పాటల ద్వారా వ్యక్తిలో క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించడమే సంఘ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఒక వ్యక్తి...