వెబ్ డెస్క్, బతుకమ్మ :
భారతీయ జనతాపార్టీకి దక్షిణాది నుంచి పెద్ద షాక్ తగిలింది. బిజేపి తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు ఐదు పేజిలతో కూడిన రాజీనామా పత్రం రాశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నామలైని బిజేపి పదవి నుంచి తప్పించారు. అంతే గాకుండా ఎమ్మెల్యే టికేట్ ను కూడా కేటాయించలేదు. అయితే స్టార్ కాంపేయినర్ గా రాష్ట్రంలో అన్నామాళై ప్రచారం చేశారు. అయితే తమిళనాడులో పొత్తు రాజకీయాలను అన్నామలై వ్యతిరేఖించారు. ఐపిఎస్ గా పనిచేస్తున్న అన్నామాలై జాతీయ భావాలతో బిజేపిలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష ఎన్నికలలో గెలువకపోయిన తమిళనాడులో అన్నామాలైకి మంచి ఫాలోయింగ్ ఉంది. అన్నామాలై రాజీనామాపై బిజేపి అగ్రనాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.