రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం భక్తులు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.