Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2025, 5:02 pm Posted by : ramakrishna

శ్రీ చక్రేశ్వరం ఆలయంలో అన్నదానం

బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం లోని శ్రీ చక్రేశ్వరం శివాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. వీఐపీలకు ఒకరకంగా సామాన్య భక్తులకు మరో రకంగా అన్న ప్రసాదం పెడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి ఇచ్చిన సరుకులలో కొంత మేరకు సరుకులు ఆలయ నిర్వాహకులు మాయం చేస్తున్నారాని దేవాదాయ శాఖ అధికారులను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపవాసంతో ఆలయానికి వచ్చే భక్తులు అన్న ప్రసాదం లేక వెనుతిరుగుతున్నారు.

Annadanam at Sri Chakrashwaram Temple