బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరం లోని 45డివిజన్ ఎల్లమగుట్ట శ్రీ విశ్వజ్యోతి దేవి శరన్నవరాత్రి మండపం వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విశ్వజ్యోతి దేవి శరన్నవరాత్రి మండపం ఏడు సంవత్సరం పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉత్సాహల కమిటీ లో బొబ్బిలి రమేష్ అన్నప్రసాదం చేశారు. అలాగే వివిధ దేవి మండపాలలో అమ్మవారి పల్లకి సేవలో బొబ్బిలి వేణు గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

