మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో గల అంగన్ వాడీ కేంద్రంలో సోమవారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బజమ్మ ముఖ్య అతిథిగా హాజరై అంగన్ వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లలకు తల్లి దండ్రులు ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్ వాడీ టీచర్స్ సుజాత, ఆయా లతా తదితరులు పాల్గొన్నారు.